Skip to main content

Namaste NRI

మా నాన్న సూపర్‌ హీరో.. నాన్న పాట వచ్చేసింది

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం  మా నాన్న సూపర్‌హీరో. అర్ణ కథానాయిక.  అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. సునీల్‌ బలుసు నిర్మాత. అక్టోబర్‌ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. రీసెంట్‌గా టీజర్‌ విడుదల చేసిన చిత్రబృందం, గురువారం ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. తండ్రికి కొడుకు రాసే ప్రేమలేఖ లాంటి ఈ పాటలో తండ్రిపై కొడుకుకి ఉన్న ప్రేమాభిమానాలను ఆవిష్కరించడం జరిగిందని మేకర్స్‌ తెలిపారు.

తండ్రి తనను నెగ్లెక్ట్‌ చేస్తున్నా, అతనితో సమయం గడిపేందుకు కొడుకు పడే ఆరాటం ఈ పాటలో చూడొచ్చు. లక్ష్మీప్రియాంక భావోద్వేగపూరితమైన సాహిత్యంతో రాసిన ఈ పాటను జై కృష్ణ స్వరపరచగా, నజీరుద్దీన్‌ ఆలపించారు. రాజుసుందరం కొరియోగ్రఫీ అందించారు. సాయాజీ షిండే, సుధీర్‌బాబు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు.  ఈ చిత్రంలో సాయిచంద్‌, రాజుసుందరం, శశాంక్‌, ఆమని ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ కల్యాణి.

Social Share Spread Message

Latest News