Skip to main content

Namaste NRI

జెలెన్స్కీ కీలక ప్రతిపాదన … అలా చేస్తే ఓకే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. కీవ్ ఆధీనం లో ఉన్న భూ భాగాన్ని నాటో పరిధిలోకి తెస్తే కాల్పుల విరమణకు తాను సిద్ధమేనని ప్రకటించారు. జెలెన్స్కీ మాట్లాడుతూ వేడిగా సాగుతున్న ఈ యుద్ధం దశను ఆపాలంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూ భాగాన్ని నాటో పరిధిలోకి తేవాలి. అలా జరిగితేనే రష్యా ఆక్రమించుకున్న మా ప్రాంతాన్ని దౌత్యమార్గంలో సాధించుకోవచ్చు. మేము వేగంగా చేయాల్సిందే అదే  అని పేర్కొన్నారు. అయితే నాటోలోని ఏ దేశం కూడా తమతో ఇలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని అన్నారు. దేశంలోని ఒక భూ భాగానికి మాత్రమే రక్షణ ఏర్పాటు చేయడం నాటోకు కూడా కష్టమేనని పేర్కొన్నారు. తమను నాటోలో చేర్చుకోవడం కష్టమేనని, అలాంటి ప్రతిపాదనేదీ కూడా రాలేదన్నారు.

Social Share Spread Message

Latest News