థర్డ్‌పార్టీ యాప్స్ అవసరం లేకుండా కెమెరాతోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ రెడీ చేస్తున్నది. ఇప్పటికే ఈ ఫీచర్ ఐవోఎస్ తాజా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. డాక్యుమెంట్లను వేగంగా షేర్ చేయాలనుకున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపకరిస్తుంది. యూజర్లు చేయాల్సిందల్లా డాక్యుమెంట్ షేరింగ్ మెనూను ఓపెన్ చేసి స్కాన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే కెమెరా యాక్టివేట్ అవుతుంది. డాక్యుమెంట్‌ను క్యాప్చర్ చేశాక యూజర్లు స్కాన్ ప్రివ్యూను ఒకసారి చూసుకుని అవసరమైన అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరి. యాప్ ఆటోమెటిక్‌గా మార్జిన్స్ చూపిస్తుంది. లేదంటే మాన్యువల్‌గానూ అడ్జస్ట్ చేసుకోవచ్చు.