Namaste NRI

ఇందిరా గాంధీ రికార్డు బద్దలు కొట్టిన నరేంద్ర మోదీ  

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అధిగమించారు. భారత దేశానికి వరుసగా సుదీర్ఘకాలం పనిచేసిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. శుక్రవారం నాటికి మోదీ 4,078 రోజులు పదవీ కాలం పూర్తి చేసుకున్నారని అధికారులు తెలిపారు. నిరంతరాయంగా దీర్ఘకాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సాధించారు. అంతకు ముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరాయంగా పదవిలో ఉన్నారు.

ఈ నిరంతరాయ పాలన రికార్డు మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉంది. 1947 ఆగస్టు 15 నుంచి ఆయన మరణించే 1964 మే 27 వరకు 6,130 రోజుల పాటు నెహ్రూ నిరంతరాయంగా భారత్‌ను పాలించారు. మోదీ, నెహ్రూ ఇద్దరికి కూడా వరుసగా మూడు ఎన్నికల్లో తమ పార్టీలను విజయపథంలో నడిపించిన రికార్డు ఉంది.

Social Share Spread Message

Latest News