
ఆస్ట్రేలియాలోని కాన్సులేట్ కార్యాలయంలో భారత స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో అక్కడకు వచ్చిన ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్బోర్న్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి భారతీయులు కాన్సులేట్ వద్ద హాజరయ్యారు. దేశ భక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్థానీలు చొరబడ్డారు. అనంతరం తమ జెండాలు ఊపుతూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల మెల్బోర్న్ లోని ఓ హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేష వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. ఆలయం గోడలపై హిట్లర్ చిత్రాన్ని ఉంచి దానిపై ాగో హోమ్ టౌన్్ణ అని రాశారు. అంతకు ముందు కూడా కొందరు దుండగులు ఓ భారతీయ విద్యార్థిపై దాడి చేసి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
















