Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ పని చేయాలి.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సలహా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి కావాలంటే ఆయన గాజాలో యుద్ధం ఆపాలని సలహా ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన మాక్రాన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నాకు శాంతి కావాలి. నేను అనేక యుద్ధాలు ఆపాను అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఐరాస సమావేశంలో చెప్పిన విషయాన్ని మాక్రాన్‌ ప్రస్తావించారు. యుద్ధం ఆపిన వారికే నోబెల్‌ శాంతి బహుమతి వస్తుందని, అయితే గాజాలో ఇంకా మారణహోమం ముగియలేదని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే శక్తి అమెరికాకు మాత్రమే ఉందని, ట్రంప్‌ మాత్రమే ఆ పని చేయగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్‌ గాజా యుద్ధాన్ని ముగించడంలో విజయం సాధిస్తేనే ఆయనను నోబెల్ బహుమతి వరిస్తుందని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News