Namaste NRI

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ లో దాయాది జుట్టు పాకిస్థాన్‌పై భారత్‌ మరుపురాని విజయం సాధించింది. 41 ఏళ్ల ఆసియా కప్‌ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్‌లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. నరాలు తెగే ఉత్కంఠ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్‌ వర్మ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్‌ ఖాతాలో తొమ్మిదో ఆసియా కప్‌ టైటిల్‌ చేరింది. అయితే మ్యాచ్‌ అనంతరం భారత జట్టు షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. పాక్‌ మంత్రి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే ఇందుకు కారణం. ట్రోఫీ, మెడల్స్‌ తీసుకోకుండా టీమ్‌ఇండియా దూరంగా ఉండిపోయారు. దీంతో భారత్‌ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఇక ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ.21 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు ఇవ్వనున్నారు.

Social Share Spread Message

Latest News