
బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని నవంబర్ 23న భారత్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. దీంతో నీరవ్ మోదీని దేశానికి తీసుకువచ్చేందుకు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి తెరపడినట్లు అవుతుంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే బ్యాంకులను మోసగించడం, మనీ లాండరింగ్ వంటి నేరారోపణలపై విచారణను మాత్రమే ఎదుర్కోవలసి ఉంటుందని, అతడిని ఏ దర్యాప్తు సంస్థ ప్రశ్నించడం కాని కస్టడీలోకి తీసుకోవడం కాని చేయబోదంటూ బ్రిటిష్ అధికారులకు హామీఇస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఓ లేఖను పంపింది. మోదీని వీఐపీ ఖైదీలను ఉంచే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
















