ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను స్వదేశంలో భారత జట్టు సగర్వంగా ముద్దాడింది. ఆదివారం సుమారు 40వేల మంది అభిమానుల సమక్షంలో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగుల వద్దే ఆగిపోయి తొలి కప్పు కలకు దూరమైంది. ఛేదనలో సారథి లారా వోల్వార్డ్ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ శతకంతో కదం తొక్కినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడం ఆ జట్టును దెబ్బతీసింది. బ్యాట్‌తో మెరిసిన దీప్తి, బంతితోనూ (5/39) కీలక వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు దీప్తి (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షెఫాలీకి దక్కగా టోర్నీలో 215 రన్స్, 22 వికెట్లతో సత్తాచాటిన దీప్తి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా ఎంపికైంది.

భారత్ ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) జఫ్టా (బి) ట్రయాన్ 45, షెఫాలీ వర్మ (సి) లుస్ (బి) ఖకా 87, జెమీమా రొడ్రిగ్స్ (సి) వొల్వోర్ట్ (బి) ఖకా 24, హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) మలబా 20, దీప్తి శర్మ (రనౌట్) 58, ఆమన్‌జోత్ కౌర్ (సి,బి) డిక్లర్క్ 12, రిచా ఘోష్ (సి) డెర్క్‌సెన్ (బి) ఖకా 34, రాధ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : లారా వోల్వోర్ట్ (బి) ఆమన్‌జోత్ (బి) దీప్తి 101, టజ్మిన్ బ్రిట్స్ (రనౌట్) 23, బాచ్ (ఎల్బీ) శ్రీచరణి 0, సునె లుస్ (సి,బి) షెఫాలీ వర్మ 25, మరిజానె కాప్ (సి) ఘోష్ (బి) షెఫాలీ వర్మ 4, సినాలో జాఫ్టా (సి) రాధ (బి) దీప్తి 16, అనెరి డెర్క్‌సెన్ (బి) దీప్తి 35, ట్రయాన్ (ఎల్బీ) దీప్తి 9, నదినె (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 18, ఖకా (రనౌట్) 1, మలబా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (45.3 ఓవర్లలో ఆలౌట్) 246.
















