
ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి మరో కీలక నిందితుణ్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడి కేసులో పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదితో కలిసి పనిచేసిన మరో ముఖ్య అనుచరుడు జాసిర్ బిలాల్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ, జాసిర్‌ను జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ లో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.
















