Skip to main content

Namaste NRI

తానా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విజయవంతం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. తానా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా సుమారు 750 పౌండ్ల ఆహార సామగ్రిని సఫోక్ వై జెసిసి కమ్యూనిటీ ఫుడ్ ప్యాంట్రీ, కమాక్, న్యూయార్క్‌కు విరాళంగా అందజేశారు. ఆహార కొరతతో బాధపడుతున్న స్థానిక కుటుంబాలకు ఈ విరాళం ఎంతో మేలు చేసింది. వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ (విఎఫ్ డబ్ల్యూ), వీట్‌లీ హైట్స్, న్యూయార్క్‌లో సైనికుల పిల్లల కోసం ఆహారం, బొమ్మలు, పాఠశాల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. 

తానా అధ్యక్షులు నరేన్ కొడాలి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి సహకారంతో ఈ రెండు కార్యక్రమాలు జరిగాయి. తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా సమన్వయం చేయగా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా దిలీప్ ముసునూరు, ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్ నాదెళ్ళ, రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్ సేవలందించారు.

ఈ కార్యక్రమాల విజయానికి మన యువ వాలంటీర్లు ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, లోహితాక్ష్ సాయి నాదెళ్ల , విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆరిజ్ మహమ్మద్ మరియు ఐరా మహమ్మద్‌లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫుడ్ గివ్ అవే కార్యక్రమానికి ప్రధాన సహకారం అందించిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి, ఈవెంట్స్‌కు మద్దతు అందించిన శిరీష తూనుగుంట్ల, సైలజ చల్లపల్లికి తానా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. సఫోక్ వై జెసీసీ ఫుడ్ ప్యాంట్రీ సిబ్బంది, వాలంటీర్లు, అలాగే వీఎఫ్‌డబ్ల్యూ సైనికులు, వారి పిల్లలు, తమకు అండగా నిలిచిన తానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా, అందరం కలిసి ముందుకు సాగుతూ, సార్థకమైన మార్పును తీసుకురావడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events