Skip to main content

Namaste NRI

ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి : వినాయక్

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఇందులో నటిస్తూ, కాండ్రేగుల నాయుడుతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వినాయక్ మాట్లాడుతూ లగడపాటి శ్రీధర్ కి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ కోరికని నెరవేర్చుతాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.

అతిథులుగా విచ్చేసిన శివ నిర్వాణ, సాయిరాజేష్‌, ఆర్పీపట్నాయక్‌, లగడపాటిశ్రీధర్‌, రసూల్‌ ఎల్లోర్‌ చిత్రబృందానికి బెస్ట్‌ విషెస్‌ అందించారు. అనకాపల్లి చిత్రంలో ప్రతి పాత్ర మధ్య పోటీ ఉంటుందని, ఒక్క సెకన్‌ కూడా డీవియేట్‌ అవ్వకుండా ఆడియన్స్‌ ఈ సినిమా చూస్తారని నిర్మాత, నటుడు త్రినాథరావు నక్కిన తెలిపారు. ఇంకా చిత్రబృందం తో పాటు మైత్రీ రవి కూడా మాట్లాడారు. అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, సంగీతం: దేవ్‌జండ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events