Skip to main content

Namaste NRI

గ్రామీణ నేపథ్యంలో కొత్త మలుపు

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయిక. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకుడు. తాటి బాలకృష్ణ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ రొమాంటిక్‌ ప్రేమకథలో సస్పెన్స్‌తోపాటు వినోదం కూడా ఉంటుందని, ఆకాష్‌, భైరవి బావామరదళ్లుగా నటించారని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు.  రఘు బాబు, పధ్వీ, ప్రభావతి, మహేందర్‌, డీడీ శ్రీనివాస్‌, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: శివ వరప్రసాద్‌ కేశనకుర్తి, నిర్మాత: తాటి బాలకష్ణ,సహ నిర్మాత: తాటి భాస్కర్‌, సంగీతం: యశ్వంత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events