రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. తనదైన శైలిలో పలు ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకి పోటీగా నిలుస్తున్నారాయ. కాగా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. మూహూర్తపు సన్నివేశానికి వీవీ వినాయక్ క్లాప్‌న్వివ్వగా, పూరి జగన్నాథ్ కెమెరా స్విఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రమిది. డిసెంబర్‌లో రెగ్యుల్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కిస్తాం అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో చిరంజీవి మాస్ అండ్ రగ్డ్ లుక్‌లో శక్తివంతంగా కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమనే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్ :రామ్‌లక్ష్మణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుస్మిత కొణిదెల, సహనిర్మాత: జీకే మోహన్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, నిర్మాతలు: నవీన్ యెర్నేన్ని, వై.రశిశంకర్, కథ, మాటలు, దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ). నాగబాబు, ఛార్మి, బుచ్చిబాబు, బి.వి.ఎస్.రవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.














