Skip to main content

Namaste NRI

చార్ ధామ్ బోర్డు కీలక నిర్ణయం… కేదార్ నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలందుకున్న ప్రముఖ ఆలయాలు మూసివేశారు.  హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను శనివారం  (నవంబర్‌ 6వ తేదీ)ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్‌ దేవస్థానం బోర్డ్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్‌, మాత యుమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్‌, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం (5వ తేదీ) మూతపడగా, బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేయనున్నట్లు చార్‌ధామ్‌ బోర్డ్‌ వెల్లడిరచింది. దీంతో చార్‌ధామ్‌ యాత్ర ముగుస్తుందని అధికారులు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News