Namaste NRI

బంగార్రాజు లడ్డుండా సాంగ్ రిలీజ్

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా బంగార్రాజు. సోగాడే చిన్నినాయన మూవీకి సీక్వెల్ గా తెరెక్కుతున్న ఈ సినిమాని కల్యాణ్ కృష్ణా డైరెక్ట్ చేస్తున్నాడు. నాగచైనత్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. మైసూర్లో తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందతున్న ఈ సినిమాలోని లడ్డుండా అనే సాంగ్ రిలీజ్ అయింది. లడ్డూండా సాంగ్ ను నాగార్జున స్వయంగా పాడారు. లడ్డుండా పాటను నాగ్ పాటు చిత్రంలో రంభ, ఊర్వశి, మేనకలపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ గీత రచయిత భస్కరభట్ల ఈ పాట రాశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రానికి సంగీతం నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత అక్కినేని నాగార్జున. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Social Share Spread Message

Latest News