Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ కు ఖమేనీ హెచ్చరిక

అమెరికా చేసే ఎటువంటి దాడి అయినా పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ సుప్రీం నాయకుడు ఖమేనీ ఆదివారం హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌పై సైనిక దాడి చేస్తానని బెదిరించిన దరిమిలా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఖమేనీ నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్‌వ్యాప్తంగా చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడంతో అరేబియన్‌ సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌, మరికొన్ని నౌకలను ట్రంప్‌ పంపించిన తర్వాత 89 ఏండ్ల ఖమేనీ అమెరికాపై ప్రత్యక్ష హెచ్చరికలు జారీచేయడం ఇదే మొదటిసారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events