Namaste NRI

హిలేరియస్‌గా హ్యాపీ రాజ్ మూవీ.. ట్రైలర్ లాంచ్‌

స్టార్‌ కంపోజర్‌, హీరో జి.వి.ప్రకాశ్‌కుమార్‌ నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ హ్యాపీ రాజ్‌. శ్రీగౌరిప్రియ కథానాయిక. మరియా రాజా ఎలాంచెజియన్‌ దర్శకుడు. జైవర్ధ నిర్మాత. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకులు శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఫన్‌తో కూడుకున్న కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సందేశంతో పాటు మనసుల్ని తాకే ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. అందరి జీవితాల్లో నాన్నే బిగ్గెస్ట్‌ హీరో. ఈ సినిమా చూసిన అందరూ ఫాదర్‌ని సెలబ్రేట్‌ చేస్తారు.

చాలాకాలం హృదయాల్లో నిలిచిపోయే సినిమా ఇది అని హీరో జీవి ప్రకాశ్‌కుమార్‌ తెలిపారు. టైటిల్‌లో ఉన్నట్టే ఈ సినిమా చాలా హ్యాపీ ఫిల్మ్‌ అనీ కథానాయిక శ్రీగౌరీప్రియ చెప్పారు. ఈ సినిమా నవ్వించమే కాదు, ఎమోషన్స్‌ని కూడా టచ్‌ చేస్తుందని దర్శకుడు మరియా రాజా అన్నారు. ఇంకా నిర్మాత జైవర్ధ, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శిశధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events