
నటి జైన్ మేరీ ఖాన్ (Zayn Marie Khan) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. అడివి శేషు హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైన్ మేరీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనకోడలు. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురు.అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాతో జైన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.ఈమె ‘ఇల్లీగల్’ (Illegal) వెబ్ సిరీస్‌లో నటించారు. ‘కపూర్ అండ్ సన్స్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.’డెకాయిట్’ సినిమా ఏప్రిల్ 10, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.
















