Namaste NRI

ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: ప్రిన్స్‌

ఫ్యాషన్‌ హంట్‌ సమర్పణలో ప్రిన్స్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నజీం ఎస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం అటు ఫ్రెండ్‌ ఇటు లవర్‌.ఈ సినిమాతో ప్రిన్స్‌, సాంచి కశ్యప జంటగా తెరకు పరిచయం కాబోతున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రిన్స్‌ మాట్లాడుతూ అందరి సహకారంతో చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. దర్శకుడు ఎంతో గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు ఆడియెన్స్‌ మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సాంచీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్‌ అవుతారు అని నాయిక సాంచి కశ్యప చెప్పారు. డైరెక్టర్‌ నజీం ఎస్‌ మాట్లాడుతూ ఈ సినిమాని మేమంతా కలిసి గొప్పగా తెరకెక్కించాం. ప్రిన్స్‌, సాంచి మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. కొత్త దర్శకుడ్ని కదా? అని కాకుండా ప్రతీ విషయంలో నాకు బ్యాక్‌ బోన్‌లా నిలిచారు అని తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇదొక డిఫరెంట్‌ స్టోరీ. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రణీత్‌ చెప్పారు. సినిమాటోగ్రాఫర్‌ రాము రాయల్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వడం ఖాయం’ అని తెలిపారు. ప్రిన్స్‌, సాంచి కశ్యప జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు : నజీం ఎస్‌, సంగీతం : ప్రణీత్‌ ఎడ్ల, ఎడిటింగ్‌ : లోకేష్‌ కుమార్‌ కడలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events