
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ ఆదర్శకుటుంబం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో రైల్వేస్టేషన్ సెట్‌లో జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగివున్న రైలుతోపాటు, ప్లాట్‌ఫామ్‌పై సీన్ గురించి డిస్కస్ చేస్తున్న వెంకీ, త్రివిక్రమ్‌లను ఈ ఫొటోలో చూడొచ్చు. ఈ సీన్ సినిమాకు కీలకమట. గతంలో వెంకటేశ్ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఈ సారి ఏకంగా డైరెక్షన్ చేస్తున్నారు. అందరి అంచనాలనూ నిజం చేస్తూ, త్రివిక్రమ్ మార్క్ ఓల్డ్ వెంకీ మామ ఈసారి తెరపై సాక్షాత్కరించడం ఖాయమని తెలుస్తున్నది. సమ్మర్ అనంతరం విడుదలయ్యే ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి కథానాయిక కాగా, హారిక అండ్ హాసిని పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.















