Namaste NRI

గాయపడ్డ సింహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

జేడీ చక్రవర్తి కీలక పాత్రలో తరుణ్‌భాస్కర్‌ కథానాయకుడిగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాయపడ్డ సింహం. విసా స్టాంపింగ్‌ పేరుతో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో తరుణ్‌భాస్కర్‌ ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ కారణంగా తన క్యారెక్టర్‌ ఎంట్రీ ఇవ్వాల్సివస్తుందని, అలా ఎందుకు జరిగిందో, దాని వెనకున్న కథేమిటో తెలుసుకోవాలంటే గాయపడ్డ సింహం సినిమా చూడాల్సిందేనని అన్నారు.

సినిమా టీమ్‌ అంతా తనకు మంచి మిత్రులని, అందుకే అతిథి పాత్రలో నటించానని హీరో శ్రీవిష్ణు తెలిపారు. ఈ కథలో ట్రంప్‌ ఎలిమెంట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని దర్శకుడు కశ్యప్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఈ సినిమా మొత్తం ఫ్రెండ్షిప్‌ వైబ్‌ కనిపిస్తుందని చిత్ర సమర్పకుడు పవన్‌ సాదినేని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్‌, కథానాయికలు మానస చౌదరి, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events