Namaste NRI

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ , అనీష్‌ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. మధుదీప్‌ చెలికాని దర్శకుడు. అరవింద్‌ మాండ్యం నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీవెంకటసాయి ఫిల్మ్స్‌ పతాకంపై ముత్యాల రామదాస్‌ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎలా ఉండబోతోందో తెలిపే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్న దని, ఇందులో ప్రేమకథ కూడా ఉంటుందని, నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే, ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని, సమ్మర్‌లో సంపూర్ణంగా వినోదాన్ని పంచే సినిమా ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్‌.వి, సంగీతం: ప్రకాశ్‌ చెరుకూరి, అరుణ్‌ చిలువేరు, సమర్పణ: సీహెచ్‌వీఎస్‌ఎన్‌ బాబ్జీ, నిర్మాణం: లోటస్‌ క్రియేషన్స్‌.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events