
వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రులను ఎంపీ భరత్ కోరారు. ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉత్తర అమెరికా లోని మిల్పిటాస్ లో నిర్వహించిన సమావేశంలో కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ప్రోత్సాహకాలు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఏపీ లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయంఅని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి ఎన్ఆర్ఐ విభాగం నాయకులు వెంకట్ కోగంటి , శ్రీకాంత్ దొడ్డపనేని, సుధీర్ ఉన్నం, భక్త బల్ల పాల్గొన్నారు.





























