Namaste NRI

పుదుచ్చేరి … మళ్లీ ఎన్డీయే ఖాతాలోకి

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. వరుసగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఏఐఎన్‌ఆర్‌సీ నేత, ముఖ్యమంత్రి రంగస్వామి పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి 18 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్‌ కూటమి ఆరు, టీవీకే 3, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.

12 సీట్లలో రంగస్వామి పార్టీ విజయం సాధించింది. ముగ్గురు నామినేటెడ్‌ సభ్యులు కూడా ఉన్న ఈ ప్రాదేశిక అసెంబ్లీలో ఎన్డీఏ మిత్రపక్షంలోని బీజేపీ నాలుగు స్థానాల్లో, ఇతర మిత్ర పక్షాలైన ఐఏఏడీఎంకే, ఎల్‌జేకే ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇక్కడ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే మూడు స్థానాల్లో విజయం సాధించింది. అలాగే డీఎంకే ఐదు, కాంగ్రెస్‌ ఒక స్థానంలో నెగ్గాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events