Namaste NRI

ముంబయి ఫిల్మ్‌సిటీలో స్వయంవర ఘట్టాల్లో రామాయణం

భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణంలో సీతా స్వయంవర ఘట్టం అత్యంత విశిష్టమైనది. పరమశివుడి దివ్యాయుధం అయిన శివధనస్సుని విరిచి శ్రీరాముడు సీతాదేవిని సహధర్మచారిణిగా స్వీకరిస్తాడు. తాజాగా ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రంలో భాగంగా సీతాస్వయంవర ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. రణబీర్‌కపూర్‌ రాముడిగా, సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ అగ్ర నటుడు యశ్‌ రావణుడి పాత్రను పోషిస్తున్నారు.

దాదాపు 4000కోట్ల భారీ వ్యయంతో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి తొలిభాగం విడుదలకానుంది. ప్రస్తుతం ముంబయి శివారు ప్రాంతంలోని ఫిల్మ్‌సిటీలో సీతా స్వయంవర ఘట్టాల కోసం మిథిలా నగర వైభవాన్ని పునఃసృష్టిస్తూ భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం రావణ పాత్రధారి యశ్‌పై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. సీతా స్వయంవరంలో పాల్గొన్న రావణుడు విల్లుని మోయలేక గర్వభంగం చెందే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో యశ్‌ అభినయం పతాకస్థాయిలో ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ తాజా షూటింగ్‌లో యశ్‌, సాయిపల్లవి పాల్గొంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events