Skip to main content

Namaste NRI

నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘనంగా తెలుగు కవి సమ్మేళనం

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి పొరుగు దేశం నేపాల్ లో అరుదైన తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఇండో నేపాల్ కవి సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మంది ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వందమందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి నేపాల్ రాజధాని ఖాట్మండులో క్రిస్టల్ పశుపతి హోటల్ వేదిక అయ్యింది. ఐఏఎస్ అధికారి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తన మిత్రబృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జివి శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సమ్మేళనంను ప్రారంభించారు.

శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వ జనీనమైనదని యాత్రల వలన సాహిత్య కారులకు ప్రపంచ జ్ఞానం విస్తృతమవుతుందని అన్నారు. ఈ కవి సమ్మేళనంలో బుర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్,పల్లి సుజాత,గోపాల్ మాదిశెట్టి, రావికంటి శ్రీనివాస్,గంగాధర్ స్తంభంకాడి,సివి శ్రీనివాస్, డాక్టర్ కూరెల్లి పద్మాచారి, కృష్ణ గోపాల్, శ్రీనివాస్ రావు ముత్తినేని , డా దాసోజూ జ్ఞానేశ్వర్,సంపత్ అశోక్ జ్యోతి, గోనె శ్రీనివాస్ ప్రేమలత తదితరులు పాల్గొని కవితలు వినిపించారు. గోపాల్ మాదిశెట్టి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events