Namaste NRI

భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రేమ, వినోదం, సస్పెన్స్‌ సమపాళ్లలో ఉంటాయని, నాయకానాయికలు బావామరదళ్లుగా కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. తెరపై కోనసీమ అందాలను ఆవిష్కరిస్తూ చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: సుమంత్‌ కాచర్ల, జవహర్‌ రెడ్డి, సంగీతం: యశ్వంత్‌నాగ్‌, దర్శకత్వం: శివ వరప్రసాద్‌ కేశనకుర్తి.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events