Namaste NRI

అమెరికాలోని డల్లాస్ లో ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటికి ఘన సత్కారం

అమెరికాలోని డల్లాస్ నగరంలో టిడిపి ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ని ఘనంగా సత్కరించారు. ప్రభుత్వానికి ప్రవాసాంధ్రులకు వారధిలా పనిచేస్తానని జయరాం కోమటి తెలిపారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు,రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి జయరాం కోమటి అని అమెరికాలోని తెలుగు వారి అందరికీ పరిచయమైన, అందుబాటులో ఉండే వ్యక్తి జయరాం కోమటి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గుళ్ళపల్లి, కే సి చేకూరి, సుధీర్ చింతమనేని తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events