Namaste NRI

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు నుంచి నువ్వే కాదా సాంగ్ రిలీజ్

స్వీయ నిర్మాణంలో వడ్డే నవీన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు. రాశిసింగ్‌ కథానాయిక. కమల్‌తేజ నార్ల దర్శకత్వం. ఈ నేపథ్యంలో నువ్వే కదా అనే పాటను విడుదల చేశారు. కల్యాణ్‌నాయక్‌ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. రోహిత్‌, హరిణి ఆలపించారు. నాయకానాయికల మధ్య ప్రేమానురాగాల్ని ఆవిష్కరించే గీతమిదని, చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నామని, ఆయన పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్‌ నాయక్‌, నిర్మాత: వడ్డే నవీన్‌, దర్శకత్వం: కమల్‌తేజ నార్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events