
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నిరాధారమైన తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఇరుదేశాల మధ్య సంప్రదింపులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఇటీవలి రోజుల్లో కూడా అవి చురుగ్గా జరిగాయని స్పష్టంచేశారు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందన్న వాదనలు తప్పుడువి, నిరాధారమైనవి అని వ్యాఖ్యానించారు.
జూన్ 2వ తేదీన కూడా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం, మూడు రోజుల క్రితం, నిన్న, ఈరోజు ఇలా ప్రతిరోజూ తమ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. చర్చల్లో పురోగతి ఉన్నప్పటికీ, తుది ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోందని తెలిపారు.





























