తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ భారత కౌన్సిల్ జనరల్ మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు వెయ్యి మంది తెలంగాణ కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆత్మార్పణం చేసుకున్న అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయని గాయకులు మేఘన, సుస్వర తారంగ్ తెలంగాణ ఉద్యమ పాటలు; సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిచారు .


ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కోడూరి ఆహ్వానితులను సన్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల, పూర్వ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో పాటు ప్రవాస ప్రముఖులు రోహిత్, దయానంద్, జగదీశ్వర్ రెడ్డి, విజేత, మధు, వర్ష, స్వాతి, కావ్య, కిరణ్ మయి, పద్మ; విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.





























