పెద్ది చిత్రానికి ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన లభించిందని, తొలిరోజు హీరో రామ్‌చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన పెద్ది చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా బాక్సాఫీస్ ఛాంపియన్ పేరుతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ఈ చిత్రం తొలిరోజే 135 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టారు. పిల్లలతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది అన్నారు.





























