Namaste NRI

ప్రేమను మించిన యుద్ధం లేదు.. అఖిల్ లెనిన్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్

రాయలసీమ విలేజ్‌ యాక్షన్‌ డ్రామా లెనిన్‌ తో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు అక్కినేని అఖిల్‌. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. సామాజికాంశాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో తన వారిని, ప్రేమను గెలిపించుకోవడానికి ప్రతీపశక్తులతో యుద్ధం చేసే యువకుడిగా అఖిల్‌ కనిపిస్తారని సమాచారం.

తాజాగా ‘పెద్ది’ ప్రదర్శిస్తున్న థియేటర్లలో ‘సోల్‌ ఆఫ్‌ లెనిన్‌’ పేరుతో ఓ పాటను చూపిస్తున్నారు. ఇందులో నాయకానాయికలు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ప్రేమకంటే గొప్ప యుద్ధం లేదు అనే క్యాప్షన్‌తో తమన్‌ స్వరకల్పనలో రూపొందిన ఈ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నదని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లియోన్‌ బ్రిట్టో, సంగీతం: తమన్‌, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్‌, రచన-దర్శకత్వం: మురళీకిషోర్‌ అబ్బూరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events