Namaste NRI

జపాన్‌ బాటలోనే నేపాల్!

భారత మామిడి రైతులకు మరో చేదువార్త వచ్చింది. జపాన్‌ బాటలోనే నేపాల్‌ కూడా నడిచింది. భారత మమాడి పండ్ల దిగుమతులపై ఇప్పటికే జపాన్‌ నిషేధం విధించగా, ఇప్పుడు నేపాల్ కూడా నిషేధం విధించింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నేపాల్ నిషేధించింది. అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధిస్తున్నట్లు బాలెన్ షా ప్రభుత్వం ప్రకటించింది.

నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ, ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది. నేపాల్ కూడా పరిమితంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events