Namaste NRI

మేకప్ లేకుండా నేచురల్గా కనిపిస్తా:రాశీసింగ్‌

వడ్డే నవీన్‌ హీరోగా, రాశీసింగ్‌ కథానాయిక నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు. కమల్‌తేజ నార్ల దర్శకుడు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా రాశీసింగ్‌ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. పక్కింటి అమ్మాయిలా సహజంగా అనిపించే పాత్ర. మేకప్‌ లేకుండా నటించాను. భర్తకు ప్రతి విషయాల్లోనూ సపోర్ట్‌గా నిలిచే ఓ చక్కటి గృహిణి పాత్ర నాది. నా రియల్‌ లైఫ్‌కి పూర్తి వ్యతిరేకమైన ఈ తరహా పాత్ర చేయడం నిజంగా నాకొక ఛాలెంజే అని అన్నారు.

వడ్డే నవీన్‌ హీరో అని తెలిశాక, ఆయన నటించిన సినిమాలపై సెర్చ్‌ చేశాను. నిజంగా ఆ హిట్స్‌ చూసి షాక్‌ అయ్యాను. యాక్టింగ్‌కి ఇంత గ్యాప్‌ ఇచ్చారెందుకు? అని ముందుగా నేనే ఆయన్ను అడిగాను. నవీన్‌ నిజంగా చాలా ఇంటలెక్చువల్‌. ఆయన దగ్గర వరల్డ్‌ నాలెడ్జ్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ సోషల్‌ మీడియాకు మాత్రం ఆయన దూరం. నేనే బలవంతంగా ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేయించాను. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని తెలిపింది రాశీసింగ్‌. దర్శకుడు కమల్‌తేజ్‌ పూర్తి క్లారిటీ ఉన్న దర్శకుడని, అనుకున్న అవుట్‌పుట్‌ వచ్చేవరకూ తను రాజీ పడడని, ఆయనతో జర్నీ చాలా స్మూత్‌గా ఉంటుందని, రీసెంట్‌గా సినిమా మొత్తం చూశానని, అద్భుతంగా అనిపించిందని, ముఖ్యంగా ైక్లెమాక్స్‌ ట్విస్ట్‌ సూపర్‌ అని రాశీసింగ్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events