Namaste NRI

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్

వెంకటేష్‌-కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌, కృతిశెట్టి కథానాయికలు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, సురేష్‌బాబు కెమెరా స్విఛాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు అనిల్‌ రావిపూడి శైలిలో ఆద్యంతం హాస్యభరితంగా సాగే చిత్రమిదని, సంక్రాంతి బరిలో వినోదాల పండగలా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతామని మేకర్స్‌ తెలిపారు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, సమర్పణ: సురేష్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌, అర్చన, నిర్మాత: సాహు గారపాటి, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events