Namaste NRI

ఇరాన్ సంచలన నిర్ణయం

ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరపడమే ఇందుకు కారణం. శనివారం కూడా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. అమెరికాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఇజ్రాయెల్ దాడులు చేసినందుకే హార్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ జాయింట్ మిలిటరీ టాప్ కమాండ్ అయిన ఖతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రకటించింది.

అంతేకాదు, ఇజ్రాయెల్‌ చర్యలపై ఇది ప్రాథమిక స్పందన మాత్రమే అని, ఇకపై దాడులు ఆపకుంటే, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచానికి షాకింగే. ముఖ్యంగా పశ్చిమాసియాపై ఇరాన్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ నిర్ణయంతో అక్కడి నౌకల కదలికలు నిలిచిపోయాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events