Namaste NRI

దేశవ్యాప్తంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమాలు…పాల్గొన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, ప్రముఖులు

యోగా ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. కోల్ కతా లోని రెడ్ రోడ్ లో 35 వేలమందితో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగా తో ప్రపంచ వ్యాప్తంగా ఒకరికి ఒకరు కలినట్లు అయ్యిందని తెలిపారు. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని దేశం మొత్తం చైతన్యం తో నిండిపోయిందని అన్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఇది మానవ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్‌ తో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో నేడు యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు సుస్థిర జీవన విధానానికి ప్రతీకగా నిలిచింది. వేలాది మంది ప్రజలతో కలిసి యోగాభ్యాసం చేయడం ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన మరియు శక్తివంతమైన భవిష్యత్తు కోసం యోగాను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుందాం అన్నారు.

Social Share Spread Message

Latest News