హర్షిత్‌రెడ్డి, స్మేహా మణిమేగలై హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దీవాన. నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి. ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దీవాన సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ కథలోని ఇంటర్వెల్, ద్వితీయార్థం బాగా నచ్చి నిర్మాణానికి ఉపక్రమించాం. ఏ సర్టిఫికెట్ వల్ల మా సినిమాకు కుటుంబ ప్రేక్షకులు రాలేకపోతున్నారు. ఒక మంచి సినిమా అందరికీ చేరువ కాలేకపోతున్నదనే బాధ మాలో ఉన్నది అని అన్నారు.

ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మరింత బలమైన కథ, కథనాలతో ముందుకు సాగే సినిమా ఇది. ఈ సినిమాకు మేం డబ్బులు పెట్టడం దగ్గరే ఆగిపోలేదు. క్రియేటివ్‌గా కూడా ఇన్వాల్వ్ అయ్యాం. గతంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌కి వర్క్ చేసిన మేం, ఈ సారి ఈ ఒక్క సినిమాపైనే దృష్టి పెట్టాం. కంటెంట్ పరంగానే కాదు, ఆర్థికంగా కూడా మాకు సంతృప్తినిచ్చిన సినిమా దీవాన అని నిర్మాతలు చెప్పారు. ప్రేమ, స్నేహం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనమే ఈ సినిమా అని, చూసినవారంతా సకుటుంబంగా చూడదగ్గ సినిమా అని మెచ్చుకుంటున్నారని, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో డే బై డే వసూళ్లు పెరుగుతున్నాయని, వచ్చే వారం సినిమా మరింత పికప్ అవుతుందని నమ్ముతున్నామని నిర్మాతలు ఆశాభావం వెలిబుచ్చారు.





























