Namaste NRI

వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాలు

వెనుజువెలాను వరుస భూకంపాలు కుదిపేశాయి. నిమిషం వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయియి. శిథిలాల కింద లక్షలాది మంది చిక్కుకుని ఉండొచ్చని, దీనివల్ల బారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెనెజువెలా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

అమెరికా భూకంప పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తొలి భూకంపం వెనెజువెలాలోని సాన్ ఫెలిపే సమీపంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీని భూకంప కేంద్రాన్ని కారకాస్‌కు పశ్చిమంగా సుమారు 284 కి.మీ. దూరంలో గుర్తించారు. ఆ తర్వాత నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండో భూకంపం కారకాస్‌కు పశ్చిమంగా 293 కి.మీ. దూరంలో ఉంది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events