అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటేనర్ బోటు ఢీకొట్టడం తో ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పటాపస్కో నదిపై నిర్మిం చిన బ్రిడ్జ్‌ను ఓ భారీ నౌక ఢీకొట్టింది. సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. బాల్టిమోర్ నుంచి ఆ నౌక శ్రీలంకలోని కొలంబోకు వెళ్తున్నది. ఆ నౌకకు దాలి అన్న పేరున్నది. బ్రిడ్జ్‌కు చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను మరో వైపు మళ్లిం చారు. ఏడు మందితో పాటు ఏడు వాహనాలు బ్రిడ్జ్ కూలిన సమయంలో నదిలో పడినట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు.