
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేస్తున్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన ఉన్నతస్థాయి ఐరాస భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన వాంగ్ ఆ సమావేశానంతరం మాట్లాడుతూ దీర్ఘకాల సమస్యలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని తెలిపారు. అయితే సంప్రదింపులలో పడే ప్రతి ముందడుగు శాంతి సాధన దిశగా ఆశలు పెంచుతుందని అన్నారు. అమెరికా, ఇరాన్, పాకిస్తాన్‌తో చర్చలు జరిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. సంబంధిత పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, శత్రుత్వాన్ని విడనాడతాయని ఆశిస్తున్నాం. ఇరాన్, అమెరికా దేశాలు ముందడుగు వేసి సాధ్యమైనంత త్వరగా మధ్యప్రాచ్యానికి శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు.





























