Namaste NRI

భార‌త్ త‌మ‌కు కీల‌క‌మైన భాగ‌స్వామి : బెంజిమ‌న్ నెత‌న్య‌హూ

ఇండియాలో త‌న‌కు మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉంద‌ని, ఫాలోవ‌ర్లు కూడా ఎక్కువ సంఖ్య‌లో ఉన్నార‌ని ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యహూ తెలిపారు. ఇజ్రాయిల్‌, ఇండియా మ‌ధ్య ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంపై ఆయ‌న మాట్లాడారు. ప్రాంతీయ వ్యూహాత్మ‌కం, కూట‌మి, టెక్నాల‌జీ వృద్ధిపై ఆయ‌న ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ భార‌త్ త‌మ‌కు కీల‌క‌మైన భాగ‌స్వామి అన్నారు. ప్ర‌పంచంలోని అనేక ప్రాంతాలు ఇజ్రాయిల్‌ను వేరుగా చూస్తున్నాయ‌ని ఆరోపించారు. కానీ భార‌త్‌లో మాత్రం త‌మ‌కు మంచి గుర్తింపు ఉన్న‌ట్లు నెత‌న్య‌హూ చెప్పారు.భార‌త్‌లో ఇజ్రాయిలీల‌కు అమిత‌మైన ప్రేమ ఉంద‌ని, నిజంగా ఎక్కువ‌గా అభిమానిస్తార‌ని, ఇత‌ర దేశాల క‌న్నా ఇండియాలో త‌న‌కు ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న‌ట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events