Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌లో కీలక పరిణామం…

ఉక్రెయిన్‌లో రస్యా నెలల తరబడి యుద్ధం సాగిస్తున్నన వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఇటలీ ప్రధాని మారియో, డ్రాఘి, రొమోనియా,  అధ్యక్షుడు క్లాస్‌ బహానిస్‌లు రైలులో రాజధాని కీవ్‌కు వచ్చారు. అక్కడి నుంచి యుద్ధ బాధిత శివారు పట్టణం ఇర్పిన్‌కు చేరుకుని, వీధి వీధినా కలియతిరిగారు. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిన సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయని, భారీ మరణహోమం చోటు చేసుకుందని మైక్రాన్‌ వ్యాఖ్యానించారు. రష్యా అనాగరికంగా వ్యవహరించిందన్నారు. శత్రువులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్‌ ప్రజలు ధైర్యసాహసాలు కనబరచడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.

                భయంకరమైన విధ్వంసం, ఉహకందని మారణహోమం చోటు చేసుకున్నాయని, రష్యా క్రూర దాడికి పాల్పడిరదని ఐహానిస్‌లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ పరిస్థితులు రానురాను మరింత కష్టతరంగా ఉంటాయని, దేశ ప్రజలకు తాము ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ నేతలు భేటీ అయ్యారు. తమకు ఆయుధాలు ఇవ్వాలని, ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ యూనియన్‌ అభ్యర్థిత్వ హోదా మంజూరయ్యేలా సహకరించాలని జెలెన్‌స్కీ వారికి విజ్ఞప్తి చేశారు. నేతలు అందుకు హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News