ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కింది. 98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నివాళి విభాగంలో భారతదేశానికి చెందిన నలుగురు దిగ్గజ కళాకారులను స్మరించింది.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) వేదికగా పలువురు నివాళులు అర్పించారు. గత ఏడాది మరణించిన ప్రపంచ సినీ ప్రముఖులను స్మరించుకుంటూ అకాడమీ ఇన్ మెమోరియం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి కోట శ్రీనివాసరావుతో పాటు ధర్మేంద్ర, సరోజాదేవీ, మనోజ్ కుమార్ పేర్లు ఉన్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుకలో భారత సినీ రంగానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.















