బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి అరుదైన గౌరవం దకింది. రష్యాలోని మాసోలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో ప్రసంగించాలని ఆయనకు స్కోల్‌కోవో సంస్థ ఆహ్వానం పంపిం ది. ఫ్యూచరిస్టిక్ అనే అంశంపై భవిష్యత్తు అవకాశాలు, వినియోగించుకునే విధానాలపై ప్రసంగించాలని కేటీ ఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపడం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050 లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కొత్త ఆవిషరణలను ప్రోత్సహించే విషయంలో కేటీఆర్ చేసిన కృషి అద్భుతమని ఆహ్వాన పత్రికలో స్కోల్‌కోవో ఫౌండేషన్ నిర్వాహకులు అభినందించారు. మీకు ఉన్న అనుభవాన్ని మాతో పంచుకు నేందుకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంచుకున్నాం. మీ రాక మాకు ఎంతో గౌరవం అని నిర్వాహకు లు కేటీఆర్‌ను ప్రశంసించారు. కార్యక్రమం ద్వారా 2030-2050 ప్రముఖ శాస్త్రవేత్తలు, భవిష్యత్తు శాస్త్రవేత్తలు, కళారంగానికి చెందిన పలు రంగాల ప్రముఖులను ఒక్కచోటుకు తీసుకొచ్చి భవిష్యత్తు తరానికి ఓ వేదికను అందించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో ఫ్యూచరాలజిస్టులు, ప్రపంచస్థాయి మేధావులు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.