Skip to main content

Namaste NRI

తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్‌షైర్‌ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌

సౌతెర్న్‌ న్యూ హాంప్‌షైర్‌ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్‌ ఛాప్టర్‌ తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌ ను నిర్వహించింది. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ప్రోత్సాహంతో తానా న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతీయ ప్రతినిధి సోంపిల్లి కృష్ణ  ప్రసాద్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అమెరికాలో ప్రతి రోజు హృదయాలను కలిచివేసే విద్యార్థుల విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అనేక బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ బాధాకరమయిన సంఘటనలకు హృదయం అతలాకుతలం అవుతోంది. అయితే, తానా రిఫ్రెష్ వర్క్‌షాప్ విభిన్నమైన కార్యక్రమం. ఇధి అంతర్జాతీయ విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతోంది. సుమారు ఎనిమిదివేల మైళ్ళ ప్రయాణం చేసి ఇక్కడ చదవటానికి ఎన్నో కలలతోటి వచ్చే స్టూడెంట్స్, వీసా రాగానే లైఫ్ సెటిల్ అయిందనే భావం తోటి వచ్చే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన చాలా అవసరం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారనే సామెతలా కాకుండా ముందుగానే విద్యార్థులకు అమెరికా నియమాలు, నిబంధనలపై అవగాహన చాలా ముఖ్యం.

విశ్వవిద్యాలయ ఓరియెంటేషన్ ప్రాముఖ్యత, ప్రొఫెసర్లతో ప్రవర్తన, తోటి విద్యార్థులు, వర్క్ దగ్గర జాగ్రత్తలు విశదీకరించారు. ఇక్కడ గవర్నమెంట్ ఎలా పని చేస్తుందీ, ప్రమాదం జరగ్గానే ఏమి చేయాలి, విద్యార్థుల హక్కులు వాటి ప్రాముఖ్యత, సమయం ప్రాముఖ్యత గురించి విడమర్చి చెప్పారు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఏమి చెయ్యాలి, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి చర్చించారు. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోకుండా, అందరితో సామరస్యంగా ఎలా వుండాలి, ఎవరికైనా గాయమైతే మనం వెంటనే ఏమి చేయాలి, ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఏమి చేయాలి, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉండాలి తదితర విషయాలు విశదీకరించి చెప్పారు.

ఈ కార్యక్రమంలో  శశాంక్ గుట్టు, అభిషేక్ ప్రగాఢ, మహేష్ కోయలమూడి, గౌతమ్ గోరంట్ల, భరత్ రెడ్డి, చైతన్య గుడివాడ, ఆదిత్య కోడి, దినేష్ గుంటుపల్లి, హేమ శ్రీ ముద్దం  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events