Skip to main content

Namaste NRI

దీపావళి సందర్భంగా పుష్ప-2 నుంచి.. రొమాంటిక్‌ పోస్టర్‌

 అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కతున్న మూవీ పుష్ప -2. రష్మిక మందన్నా హీరోయిన్‌.  దీపావళి పండగ సందర్భంగా రష్మిక, అల్లు అర్జున్‌ రొమాంటిక్‌ పోస్టర్‌ను మేకర్‌ వదిలారు. ఈ మూవీని ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో 5వేల స్క్రీన్స్‌, భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తున్నది.ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఒడియా భాషలో ఒకేసారి విడుదల చేయనున్నారు.

 ఈ మూవీలో ఫహాద్‌ ఫాజిల్‌, రావు రమేశ్‌, అనసూయ భరద్వాస్‌, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా,  డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ బాధ్యతలు పోలెండ్‌ కెమెరామెన్‌ కూబాకు అప్పగించారు. ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుందని టాక్‌ వినిపి స్తున్నది. ఈ సాంగ్‌ను నవంబర్‌ 4 నుంచి షూటింగ్‌ జరుపుకోనందని,  ఇక రెండోవారంలో మరో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత నుంచి మూవీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తున్నది. డిసెంబర్‌ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్‌ ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events