Skip to main content

Namaste NRI

టీటీడీకి షాక్‌… ఆ భక్తుడికి రూ.50 లక్షల పరిహారం… లేకుంటే

తిరుమల తిరుపతి దేవస్థానానికి వినియోగారుల కోర్టు షాక్‌ ఇచ్చింది. మేల్‌ చాట్‌ వస్త్ర సేవ నిమిత్తం బుక్‌ చేసుకున్న ఓ భక్తుడికి ఆ సేవను అందించకపోవడాన్ని కోర్టు తప్పపట్టింది. ఆ భక్తుడికి ఏడాదిలోగా ఆయన కోరుకున్న సేవను అందించాలని లేకుంటే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని టీటీడీ ట్రస్ట్‌ బోర్డ్‌ను కోర్టు ఆదేశించింది. తమిళానాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన హరిభాస్కర్‌ 2006లో తిరుమల శ్రీవారి మేల్‌ చాట్‌ వస్త్రం సేవ నిమిత్తం 12,250 రూపాయలు టీటీడీకి చెల్లించారు. 16 సంవత్సరాలు  కావస్తున్నా ఆ భక్తుడికి మేల్‌ చాట్‌ సేవలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించలేదు. పలుమార్లు టీటీడీకి విజ్ఞప్తి చేసినా  టీటీడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు.  కరోనా సమయంలో మేట్‌ చాట్‌ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్‌ ఇస్తామని టీటీడీ అధికారులు ఆఫర్‌ ఇచ్చారు. అందుకు హరిభాస్కర్‌ అంగీకరించలేదు. తన విజ్ఞప్తిని టీటీడీ పట్టించుకోకపోవడంతో సేలం జిల్లాలోని వినియోగారుల కోర్టును ఆశ్రయించారు. హరిభాస్కర్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తగిన రుసుం చెల్లించినపప్పటికీ ఆ భక్తుడికి ఏడాదిలోపు మేల్‌ చాట్‌ వస్త్రం సేను కల్పించాలని ఆదేశించింది. లేకుంటే రూ.50 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events